హాసెల్ బ్లాడ్ అవార్డు - విజేత , ఫోటోగ్రాఫర్ దయాని తా సింగ్, దయాని తా సింగ్ - PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును నెలకొల్పడానికి PARIతో కలిసి పనిచేశారు

మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డు కింద రూ. 2 లక్షలను పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాకు చెందిన ఎం. పళని కుమార్ గెలుచుకున్నారు
ఈ బహుమతిని నెలకొల్పాలనే ఆలోచన, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫోటోగ్రఫీ బహుమతిగా పరిగణించబడే హాసెల్‌బ్లాడ్ 2022 అవార్డును దయానితా గెలుచుకోవడం ద్వారా వచ్చింది. యువకుడైన పళని కుమార్ స్వయంగా నేర్చుకున్న ఫోటోగ్రఫీ ఉద్దేశ్యం, విషయం, స్ఫూర్తి, డాక్యుమెంటరీ అసాధారణత్వం తనను బాగా ఆకట్టుకున్నట్లు దయానితా ప్రకటించారు.
ఆమె ఈ బహుమతిని పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాతో కలిసి ఒక సహకార వెంచర్‌గా మార్చాలని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆమె PARIని డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీకి చిట్టచివరి స్థావరంగానూ, అట్టడుగు వర్గాల జీవితాలపై, జీవనోపాధిపై దృష్టి సారించేదిగానూ భావిస్తున్నారు.
పళని కుమార్ PARIకి తొలి పూర్తి-కాల ఫోటోగ్రాఫర్ (మేం ఫోటో షూటింగ్ సహాయకులుగా సుమారు 600 మందితో కలిసి పని చేశాం). PARIలో ప్రముఖంగా ప్రదర్శించబడిన అతని పని- పారిశుద్ధ్య కార్మికులు, సముద్రపు నాచును సేకరించేవారు, వ్యవసాయ కార్మికులు సహా మనం అతి తక్కువగా పరిగణించే మరింతమందిపై తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించింది. పనిలో అతని నైపుణ్యం, బలమైన సామాజిక చైతన్యంతో సరిపోల్చగలవారు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో అతనివంటి కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో 25,000 ఎకరాల ఉప్పుకయ్యలలో అతి తక్కువ కూలీ కోసం శ్రమించి, చెమటలు కక్కుతున్న అనేక మంది మహిళల్లో రాణి కూడా ఒకరు. తూత్తుకుడి ఉప్పుమడుల రాణి నుంచి

ఎ. మూకుపొరి ఎనిమిదేళ్ల వయసు నుంచే సముద్రపు నాచు కోసం నీటిలోకి దూకుతున్నారు. ఈ అసాధారణమైన, సంప్రదాయక వృత్తిలో మునిగివున్న తమిళనాడులోని భారతీనగర్‌కు చెందిన అనేకమంది మత్స్యకార మహిళలు ఇప్పుడు తమ జీవనోపాధిని ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పులతో పోరాడుతున్నారు.
తమిళనాడులో
సముద్రపు
నాచును
వెలికితీసే
కార్మికుల
ఎదురీత
నుంచి



తమిళనాడు, తూత్తుకుడి జిల్లాలో ఉప్పుమడుల కార్మికులు మండుటెండలో, అసౌకర్యంగా ఉండే పని ప్రదేశంలో, మనమంతా వంటగదిలో ముఖ్యమైన దినుసుగా వాడే ఉప్పుని పండిస్తారు.
తూత్తుకుడి ఉప్పుమడుల
రాణి
నుంచి


కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఒక్క రోజు సెలవు కానీ, ఎటువంటి రక్షణ పరికరాలు కానీ లేకుండా నగరాన్ని ఊడ్చడం, శుభ్రపరచడం వంటి పనులు చేయడంకోసం చెన్నైలోని పారిశుద్ధ్య కార్మికులు చాలా దూరాలు నడిచారు.
Sanitation
workers - the wages of ingratitude
నుంచి

అంగవైకల్యం ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు రీతా అక్క , చెన్నైలోని కొత్తూరుపురం ప్రాంతంలో ఉదయంవేళల్లో చెత్తను తొలగిస్తారు . కానీ ఆమె సాయంకాలాలు మాత్రం తన సహచరులైన కుక్కలకు ఆహారాన్నివ్వడం , వాటితో మాట్లాడటంతో గడుస్తుంటాయి . Rita akka’s life is going to the dogs (and cats) నుంచి



అనువాదం: సుధామయి సత్తెనపల్లి